18, అక్టోబర్ 2013, శుక్రవారం

                                           శ్రీ ఉమావీరేశ్వరస్వామి 

వీరేశ్వరస్వామి

ఉమాదేవి 

శ్రీ ఉమావీరేశ్వరస్వామి వారి ఆశ్రమం స్థితిగతులు:-

           

                                    విజయనగరం జిల్లా జామిమండలంలో గల రామభద్రపుర అగ్రహారం గ్రామంలో గ్రామాన ఉత్తర ఈశాన్యదిక్కులోఉన్నతోటలలో ఒక పెద్దమర్రిచెట్టు క్రింద పూజాధికములు లేక ఎండకుఎండి వానకుతడుస్తూ ప్రకృతి వైపరిత్యాలను భరిస్తూ ఒక స్వయంభులింగం అని చెప్పబడే ఒక శివలింగం ఉండేది.

                          

                                          ఈశివలింగమునకు ఆవాసమైన మర్రిచెట్టు క్రింద ఆదారిలో ప్రయాణమును సాగించే బాటసారులు,పశువులకాపరులు సేదతీరేవారు. ఈశివలింగం కనీసంకొన్ని శతాబ్ధాలకు   పూర్వముదని ఒక అంచనా. 

 

                                       ఎన్నో రోజులు కాలగర్భంలో కలిసిపొతున్న తరుణంలో సాయినాన్న (అగ్రహార గ్రామ కాపరస్తులైనటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబమునకు చెందినవారు ) చూసి చలించి దీనికి ఒక శాశ్వత ఆవాస పరిష్కారానికై ఉత్సుకతతో కూడిన యోచనచేసి గ్రామస్తులందరిని చైతన్యవంతులను చేస్తూ గ్రామస్తులందరి దగ్గర కొంతకొంత ద్రవ్యమును ఆర్జించి ఆశివలింగం చుట్టూ ఒక ఆలయమును నిర్మించినారు.

                                

                                       ఈఅలయమునకు ఈశ్వరనామసంవత్సర వైశాఖ బహుళ ఏకాదశి అనగా తే:01/06/1997:ది ఆదివారమునాడు ఆగమశాస్త్ర విధానములో ప్రతిష్టాధికములు చేయించి నిత్య ధూప,దీప,నైవేద్యములను తగు విధానములో జరిపిస్తూ ఆలయమును దినదిన ప్రవర్ధమానము చెందిస్తూ కొంతకాలములోనే శ్రీఉమావీరేశ్వరస్వామివారి ఆశ్రమం ను స్థాపించినారు. 

ఆశ్రమ వివరములు :- 

 సాయినాన్నగారు అమలాపురంలో ఉంటూ పురోహితముచేయిస్తూ ఆవచ్చిన ద్రవ్యముతో వారి       గురుదేవుల ఆశీస్సులతో హింధూధర్మప్రచారము కోసం ఆశ్రమముద్వారాచుట్టుప్రక్కలగ్రామాలలో     సామూహికసత్యన్నారాయణవ్రతములు,రుద్రాభిషేకములు,గాయత్రిమహయజ్ఞాలు,కుంకుమపూజలు, లక్ష్మిగణపతి, లక్ష్మినారాయణయజ్ఞాలు చేయిస్తూ,పురాతన ఆలయాలను అభివృధ్దిచేస్తూ,       వందలాదిమందికి వస్త్రదానములు,పేదవిద్యార్ధులకు ఉచితవిద్యను,నిత్యమూ పేదలకు          భోజనాధికములను నిర్వర్తిస్తూ ఆశ్రమమును నడిపిస్తున్నారు ఈఆశ్రమమేకాక                      తలారి(కొట్యాడ-తలారి)అనే గ్రామములో వేరొకఆశ్రమమును నడిపిస్తున్నారు 

గమనిక :-ఇది తెలియచేయటానికి మూలం :ప్రతీ ఒక్కరు,మరియు పురోహితులు దీనిని ఆదర్శంగా తీసుకుని మీమీ ప్రాంతాలన్నీ  ఆధ్యాత్మికముగా  అభివృద్ధి చేస్తూ హిందుధర్మ పరిరక్షణకు చేయూతనిస్తారని  ఆశిస్తున్నాం     

ఎవ్వరిదగ్గర  ఎటువంటి సహాయము కోరటానికి మాత్రమూ కాదు ధర్మ ప్రచారముకోసమని   గమనించగలరు